HYderabad, ఏప్రిల్ 27 -- దీర్ఘాయువు కోసం, మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అలా కాకపోయినా బతికి ఉన్నంతకాలం ఆరోగ్యంగా ఉండేందుకైనా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. గుండె త్వరగా అలసిపోకుండా ఆరోగ్యంగా ఉండేందుకు ప్రత్యేకమైన ఆహారం అవసరం. ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా, నరాలలో కలిగిన అడ్డంకిని తొలగించడానికి సహాయపడుతుంది. అనేక సందర్భాల్లో, పోషకాహార నిపుణులు సాధారణ వ్యక్తి బడ్జెట్‌కు అందని ఆహార పదార్థాల గురించి సూచిస్తారు.

కానీ, మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి అటువంటి ఖరీదైన ఆహార పదార్థాలను కొనుగోలు చేయలేని వారు ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఈ సాధారణ, చౌకగా దొరికే 5 పదార్థాలతో కూడా మీ గుండెను పదిలంగా ఉంచుకోవచ్చు. అందరికీ అందుబాటులో ఉండే ఆ 5 పదార్థాలు ఏమిటో తెలుసుకుందాం.

ఆరోగ్యకరమైన గుండె కోసం బ్రోకలీ తినమని చాలా సలహాలు ఇస్తార...