Hyderabad, సెప్టెంబర్ 21 -- మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన రొమాంటిక్ కామెడీ డ్రామా థ్రిల్లర్ హృదయపూర్వంలో హీరోయిన్ మాళవిక మోహనన్, ప్రేమలు ఫేమ్ సంగీత్ ప్రతాప్ కీలక పాత్రలు పోషించారు. అలాగే, సంగీత మాధవన్ నాయర్, బసిల్ జోసెఫ్, మీరా జాస్మిన్, ఆల్తాఫ్ సలీమ్ తదితరులు ఇతర పాత్రల్లో మెరిశారు.

సత్యాన్ అంతికడ్ దర్శకత్వం వహించిన హృదయపూర్వం సినిమా ఆగస్ట్ 28న థియేటర్లలో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. 7.1 ఐఎమ్‌డీబీ రేటింగ్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 80 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. అలాంటి హృదయపూర్వం ఓటీటీలోకి వచ్చేయనుంది.

జియో హాట్‌స్టార్‌లో సెప్టెంబర్ 26 నుంచి హృదయపూర్వం ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. అది కూడా మలయాళం, తెలుగుతో సహా ఐదు భాషల్లో హృదయపూర్వం ఓటీటీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా హృదయపూర్వం మూవీపై...