భారతదేశం, జూన్ 12 -- న్యూఢిల్లీలోని అపోలో ఇంద్రప్రస్థ ఆసుపత్రిలో సీనియర్ కన్సల్టెంట్, కార్డియోవాస్కులర్ అండ్ ఎయోర్టిక్ సర్జన్ డాక్టర్ నిరంజన్ హిరేమఠ్ హెచ్‌టి లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిశబ్దంగా వచ్చే గుండె పోటు విషయంపై ఆందోళన వ్యక్తం చేశారు. "30లలో లేదా 40లలో ఉన్న వ్యక్తులు, బయటికి ఆరోగ్యంగా, చురుకుగా కనిపిస్తారు. కానీ, అకస్మాత్తుగా కుప్పకూలడం లేదా ఎమర్జెన్సీ గదికి వెళ్ళిన తర్వాత వారికి గుండెపోటు వచ్చిందని నిర్ధారణ అవుతుంది. వారు అసలు దీనిని ఊహించి కూడా ఉండరు. ఇవి ఇప్పుడు చాలా అరుదుగా జరిగేవి కాదు. గుండె సమస్యల సంకేతాలు ఏవీ కనిపించకుండానే యువకులలో 'సైలెంట్ హార్ట్ ఎటాక్స్' కేసులు పెరుగుతున్నాయి" అని డాక్టర్ హిరేమఠ్ వివరించారు.

క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ అంచనాల ప్రకారం, నమోదయ్యే మొత్తం గుండెపోట్లలో 22 శాతం నుంచి 60 శాతం వరకు సైలెంట్ గ...