భారతదేశం, నవంబర్ 17 -- బిగ్ బాస్ 9 తెలుగు పదకొండో వారానికి చేరుకుంది. ఇక బిగ్ బాస్ తెలుగు 9 పదోవారంలో డబుల్ ఎలిమినేషన్ చోటు చేసుకుంది. బిగ్ బాస్ 9 తెలుగు గత వారం సీరియల్ నటులు నిఖిల్ నాయర్, గౌరవ్ గుప్తా ఎలిమినేట్ అయ్యారు. ఈ ఇద్దరితో ఒకేసారి బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ నిర్వహించారు.

ఈ బిగ్ బాస్ తెలుగు 9 బజ్ ఇంటర్వ్యూలో శివాజీ అడిగిన ప్రశ్నలకు నిఖిల్, గౌరవ్ నవ్వుతూనే సమాధానం చెప్పారు. ముందుగా నిఖిల్ నాయర్, గౌరవ్ గుప్తా బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలోకి కలిసి అడుగుపెట్టారు. "ఆహా వీళ్లిద్దరిని చూస్తుంటే గుండమ్మ కథలో ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల లేరు (ఉన్నారనే అర్థంలో)" అని హీరో శివాజీ అన్నాడు.

దానికి నిఖిల్ నాయర్ షాక్ అయి "నిజమా.." అని అన్నాడు. "నిఖిల్ హౌజ్‌లో హైడ్ అండ్ సీక్ బాగా ఆడావ్. స్టార్టింగ్‌లో వెళ్లావ్. మళ్లీ ఇప్పుడే కనపడ్డావ్ నాకు. మధ్యలో అంతా హైడే ...