భారతదేశం, సెప్టెంబర్ 14 -- బంగాళాఖాతంలో ఆదివారం సముద్ర మట్టానికి 3.1 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని ఐఎండీ తెలిపింది. అల్పపీడనం, ధ్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు, పిడుగులో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ వెల్లడించింది. సెప్టెంబర్ 15 నుంచి 18 మధ్య ఆంధ్రప్రదేశ్, యానాంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ కాలంలో గంటకు 30 నుండి 40 కి.మీ వేగంతో బలమైన గాలులు వీయనున్నాయి.

సెప్టెంబర్ 15న ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, చిత్తూరు, తిరుపిత జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో...