Hyderabad, ఏప్రిల్ 13 -- ఆభరణాలు అంటే మహిళలకు ప్రత్యేకమైన మమకారం. అయితే రోజురోజుకూ పెరిగిపోతున్న బంగారం ధరలతో పాటు భద్రతా భయాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇలాంటి సమయంలో గిల్టు నగలు మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి. ఇవి బంగారానికి చాలా దగ్గరగా కనిపించేలా ఉండి, తక్కువ ఖర్చులో ఎక్కువ డిజైన్లలో అందుబాటులో ఉంటున్నాయి. అంతేకాదు ఫ్యాషన్ రోజురోజుకూ మారిపోతుండతో ప్రతి మహిళ కూడా ట్రెండ్‌కు తగ్గట్టుగా తనను ఆమెగా మలుచుకోవాలనుకుంటోంది. ఇవి ప్రతి వయసు మహిళకు, ప్రతీ స్టైల్‌కి అద్దం పడుతున్నాయి.అందుకే వీటికి ఆడవాళ్లంతా ఫిదా అయిపోతున్నారు.

గతంలో ఇవి కేవలం చిరుద్యోగులు అంటే బంగారం కొనలేని వారికి మాత్రమే పరిమితంగా ఉండేవి. కానీ ఇప్పుడు ఫ్యాషన్ రంగం మారిపోవడంతో, సెలబ్రిటీల దగ్గర నుంచి సామాన్యురాలివరకు గిల్టు నగలే ధరిస్తున్నారు. ఇవి అందాన్ని పెంచడమే కాకుండా,...