భారతదేశం, ఆగస్టు 4 -- ఝార్ఖండ్​ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్ర ఆవిర్భవంలో కీలక పాత్ర పోషించిన శిబూ సోరెన్​ కన్నుమూశారు. అనారోగ్య సమస్యల కారణంగా 81ఏళ్ల శిబూ దిల్లీలోని గంగారామ్​ ఆసుపత్రిలో తిదిశ్వాస విడిచారు. ఝార్ఖండ్​ ముక్తి మోర్చా (జేఎంఎం) వ్యవస్థాపకుడైన సోరెన్ మరణంతో గిరిజన ఉద్యమం జాతీయ స్థాయిలో ప్రాముఖ్యతను సంతరించుకున్న ఒక రాజకీయ శకానికి ముగింపు పలికింది!

1944 జనవరి 11న రామ్‌గఢ్ జిల్లాలోని నెమ్రా గ్రామంలో (అప్పటి బీహార్‌లో, ప్రస్తుత ఝార్ఖండ్​లో) జన్మించిన శిబూ సోరెన్‌ను 'దిశోమ్ గురు' (భూమి నాయకుడు) అని, జేఎంఎం పితామహుడిగా ప్రజలు ఆప్యాయంగా పిలుచుకునేవారు. దేశంలోని గిరిజన, ప్రాంతీయ రాజకీయ రంగంలో ఆయన అత్యంత ప్రభావవంతమైన నాయకులలో ఒకరు. గిరిజనుల హక్కుల కోసం నిరంతరం పోరాడటమే ఆయన రాజకీయ జీవితానికి నిదర్శనం.

సోరెన్ కుటుంబ సభ్యుల ప్రకారం.. ఆయన ప్...