భారతదేశం, ఏప్రిల్ 26 -- హ‌న్సిక హీరోయిన్‌గా న‌టించిన గార్డియ‌న్ మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. హార‌ర్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీకి శ‌బ‌రి గురు శ‌ర‌వ‌ణ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. త‌మిళ అనువాదంగా రూపొందిన ఈ మూవీ తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించిందా? లేదా? అంటే?

అప‌ర్ణ‌ను (హ‌న్సిక‌) అంద‌రూ అన్‌ల‌క్కీ అప‌ర్ణ అంటూ ఆట‌ప‌ట్టిస్తుంటారు. చిన్న‌త‌నం నుంచి ఆమె కోరుకున్న‌ది ఏది జ‌ర‌గ‌దు. ప్రాణంగా ప్రేమించిన ప్ర‌భ ఆమెకు దూర‌మ‌వుతాడు. అర్కిటెక్చ‌ర్ పూర్తిచేసిన అప‌ర్ణ‌కు ఒక్క జాబ్ రాదు. ప్రాజెక్ట్ వ‌ర్క్‌లో భాగంగా క‌న్‌స్ట్ర‌క్ష‌న్‌లో ఉన్న ఓ బిల్డింగ్ ద‌గ్గ‌ర‌కు వ‌స్తుంది అప‌ర్ణ‌. అక్క‌డ ఆమెకు అనుకోకుండా ఓ క్రిస్ట‌ల్ (మెరుపు రంగు రాయి) దొరుకుతుంది.

అప్ప‌టి నుంచి అప‌ర్ణ జీవిత‌మే మారిపోతుంది. అప‌ర్ణ కోరుకున్న‌వ‌న్నీ జ‌రిగిపోతుంటాయి. కే అనే ప...