భారతదేశం, మే 7 -- పహల్గామ్ ఉగ్రదాడికి భారత్...పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఆపరేషన్ సిందూర్ పై స్పందించిన పవన్ కల్యాణ్... ప్రతి భారతీయుడు హర్షించదగ్గ సందర్భం అన్నారు. ఈ దాడిలో జమ్మూలో 30 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారన్నారు. మొత్తం మీద 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించినట్లు చెబుతున్నారని చెప్పారు.

"పాకిస్తాన్‌లో 4 చోట్ల, పీవోకేలో 5 చోట్ల మొత్తం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను భారత ఆర్మీ నేలమట్టం చేసింది. 8 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల రేంజ్‌లో భారత వాయుసేన మిస్సైళ్ల వర్షం కురిపించింది. మూడు ఉగ్రవాద సంస్థలపై భారత్ దాడి చేసింది. పాకిస్థాన్‌కు భారత్ తగిన గుణపాఠం చెప్పింది. ప్రధాని మోదీ నాయకత్వంలో ధీటైన జవాబు ఇచ్చాం" - పవన్ కల్యాణ్

భారత్‌పై ఎవరు దాడి చేసినా సహించేదిలేదంటూ డిప్యూటీ సీఎం పవన్ కల...