భారతదేశం, జనవరి 3 -- కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాల కుమారుడు రైహాన్ వాద్రా ఒక ఇంటివాడు కాబోతున్నారు. తన చిన్ననాటి ప్రేయసి అవివా బేగ్‌తో ఆయన నిశ్చితార్థం వైభవంగా జరిగింది. సోమవారం (డిసెంబర్ 29, 2025) జరిగిన ఈ ప్రైవేట్ వేడుకకు సంబంధించిన ఫోటోలను రైహాన్ స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రెండు ఆసక్తికరమైన ఫోటోలను పోస్ట్ చేశారు రైహాన్ వాద్రా. ఒక ఫోటోలో కొత్త జంట కలిసి పోజులివ్వగా, రెండోది వారిద్దరి చిన్ననాటి ఫోటో కావడం విశేషం. దీనికి "29.12.25" అనే తేదీని మాత్రమే క్యాప్షన్‌గా ఇచ్చారు.

చిన్నప్పటి నుంచి స్నేహితులుగా ఉండి, ఇప్పుడు జీవిత భాగస్వాములుగా మారబోతున్న ఈ జంటను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియాలో అభిమానులు, శ్రేయోభిలాషుల నుంచి వీరికి...