Hyderabad, జూలై 26 -- తెలుగు సినీ ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ-రష్మిక మందన్నాది సూపర్ హిట్ పెయిర్. వీరి జోడీకి ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అంతేకాకుండా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా డేటింగ్ రూమర్స్ తెగ వైరల్ అవుతుంటాయి. కొన్ని సందర్భాల్లో వీరిద్దరు డేటింగ్ చేస్తున్నట్లు ఇన్‌డైరెక్ట్‌గా హింట్స్ కూడా ఇచ్చారు.

తాజాగా మరోసారి విజయ్, రష్మిక డేటింగ్ రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందుకు కారణం ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ నిర్మోహమాటంగా చేసిన కామెంట్సే. తాజాగా సినిమా వికటన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ తన వ్యక్తిగత జీవితం గురించి నిర్మొహమాటంగా చెప్పాడు. తన ప్రేయసితో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.

విజయ్ దేవరకొండ మాట్లాడుతూ "రిలేషన్‌షిప్స్ అన్నింటికీ మించి ఉంటాయి. వాటికి మించి ఏముంటుంది. నేను గత 2 సంవత్సరాలుగా జీవితాన్...