Hyderabad, మే 5 -- గర్భిణీగా ఉన్నప్పుడు మీ ఉదర భాగం పెరుగుతూ ఉంటుంటే, మీకు చర్మంపై దురద వస్తుంటుంది. ఇది కేవలం చర్మం దురదతో ఆగిపోదు స్ట్రెచెస్ కూడా కావొచ్చు. వీటితో పాటుగా చనుమొనల్లో కూడా దురద కలుగుతుంటుంది. సాధారణంగా ఈ సమస్య హార్మోన్లలో కలిగే మార్పుతో కలగొచ్చు. ఎందుకంటే, గర్భిణీగా ఉన్నప్పుడు ఎగ్జిమా అనే చర్మసమస్య చాలా సాధారణంగా కనిపిస్తుంటుంది. ఇది శరీరంలోని చాలా భాగాలపై ప్రభావం చూపిస్తుంది కూడా. ఇంతేకాకుండా చర్మంపై దురద రావడానికి మరిన్ని కారణాలు కూడా ఉన్నాయట. అవేంటో తెలుసుకుందాం.

గర్భిణీగా ఉన్నప్పుడు చనుమొనల్లో దురద రావడానికి పలు కారణాలు ఉన్నాయి. అవేంటంటే,

గర్భిణీగా ఉన్నప్పుడు ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్లలో మార్పులు సహజంగానే కనిపిస్తాయి. ఈ హార్మోన్ల మార్పు కారణంగా రొమ్ము పరిమాణం పెరుగుతుంది కూడా. ఆ సమయంలో రక్త సరఫరా కూడా ఎక్క...