Gadwal,telangana, జూన్ 26 -- రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్‌ హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేశారు. మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకున్నారు.A1 తిరుమల రావు, A2 ఐశ్వర్య, A8 సుజాత (ఐశ్వర్య తల్లి) పేర్లను చేర్చారు. హత్యకు ఉపయోగించిన కారు, 2 ఎరుకలి కొడవళ్ళు, ఒక కత్తి, రూ.లక్ష 20 వేలు, 10 మొబైల్ ఫోన్లతో పాటు జీపీఎస్ ట్రాకర్ ను స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసుకు సంబంధించిన వివరాలను గద్వాల జిల్లా ఎస్పీ ఇవాళ వెల్లడించారు. బ్యాంకు మేనేజర్‌ తిరుమలరావుకు ఐశ్వర్యతో పాటు ఆమె తల్లితో సంబంధం ఉందని తెలిపారు. ఈ వివాహేతర సంబంధాలను ఇలాగే కొనసాగించాలని తిరుమలరావు అనుకున్నాడని చెప్పారు. ఎంగేజ్‌ మెంట్‌ అయినప్పటి నుంచి తేజేశ్వర్‌ను చంపేందుకు స్కేచ్‌ వేశారని వివరించారు.

తేజేశ్వర్‌ను చంపేస్తే ఐశ్వర్యతో సంబంధం కొనసాగించవచ్చని తిరుమలరావు భావి...