Telangana, మే 29 -- 2024 ఏడాదికి సంబంధించిన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డులపై ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ మేరకు ఏర్పాటైన జ్యూరీ కమిటీ వివరాలను గురువారం వెల్లడించింది. ఈ సందర్భంగా పలు విభాగాల్లో అవార్డులు దక్కించుకున్న చిత్రాల వివరాలను పేర్కొంది.

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజా గాయకుడు గద్దర్ పేరిట అవార్జులను ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ జ్యూరీ(కమిటీ)కి ఛైర్మన్ గా టాలీవుడ్ సీనియర్ నటి జయసుధను ఎంపిక చేశారు. కమిటీలో సభ్యులుగా 15 మందికి అవకాశం కల్పించారు.

ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డుల కోసం పలు కేటగిరీల కింద నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిని స్క్రీనింగ్ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత.. తాజాగా జ్యూరీ కమిటీ అవార్డుల ప్రకటన వివరాలను వెల్లడించింది. ఉమ్మడి ఆంధ్రప్రద...