భారతదేశం, మార్చి 17 -- గత 10 ఆర్థిక సంవత్సరాల్లో బ్యాంకులు దాదాపు రూ. 16.35 లక్షల కోట్ల విలువైన చెల్లని ఆస్తులు (ఎన్‌పీఏలు) లేదా మొండి బకాయిలను రద్దు చేశాయని సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌కు తెలియజేశారు.

2018-19 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా రూ.2,36,265 కోట్లు, 2014-15లో రూ.58,786 కోట్ల ఎన్పీఏలను రద్దు చేశారు. 2023-24లో బ్యాంకులు రూ.1,70,270 కోట్ల మొండి బకాయిలను మాఫీ చేశాయి.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మార్గదర్శకాలు, బ్యాంకుల బోర్డులు ఆమోదించిన విధానం ప్రకారం బ్యాంకులు నాలుగేళ్లు పూర్తయిన తర్వాత పూర్తి ప్రొవిజనింగ్ చేసిన వాటితో సహా నిరర్థక ఆస్తులను (ఎన్పీఏ) రద్దు చేస్తాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభకు ఇచ్చిన సమాధానంలో తెలిపారు.

ఇలాంటి మాఫీల వల్ల రుణగ్రహీతల అప్పులు మాఫీ కావని, అందువల్ల రుణగ...