Hyderabad, ఆగస్టు 10 -- ఓటీటీలో ఇటీవల తెలుగు ఒరిజినల్ కంటెంట్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు విపరీతంగా వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలోనే రీసెంట్‌గా ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన తెలుగు కామెడీ వెబ్ సిరీస్ మోతెవరి లవ్ స్టోరీ. స్వచ్చమైన తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు.

మై విలేజ్ షో సిరీస్ ఫేమ్ అనిల్ గీలా, వర్షిణి రెడ్డి జున్నుతుల హీరో హీరోయిన్లుగా నటించిన మోతెవరి లవ్ స్టోరీ ఓటీటీ వెబ్ సిరీస్‌లో సదన్న, మురళిధర్ గౌడ్, రవి చంద్ర, రాజు తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ సిరీస్‌కు శివ కృష్ణ బుర్రా దర్శకత్వం వహించారు.

చరణ్ అర్జున్ సంగీతం అందించిన మోతెవరి లవ్ స్టోరీకి శ్రీకాంత్ అరుపుల కమెరామెన్‌గా పని చేశారు. ఇదిలా ఉంటే, ఓటీటీ రిలీజ్‌కు ముందు రోజు మోతెవరి లవ్ స్టోరీ మెగా ప్రివ్యూ ఈవెంట్ నిర్వహించారు. మొదటి 4 ఎపిసోడ్స్ ఓటీటీ స్ట్రీమింగ...