భారతదేశం, సెప్టెంబర్ 4 -- సెప్టెంబర్ 6న హైదరాబాద్‌లో గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. జీహెచ్‌ఎంసీ హైదరాబాద్‌లో రోడ్ల మరమ్మతులు, బారికేడింగ్‌లు, వీధి దీపాలను వేగవంతం చేస్తోంది. ఖైరతాబాద్ బడా గణేష్ సెప్టెంబర్ 6న శోభాయాత్రగా వెళ్లి నిమజ్జనం చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకుంటున్నారు.

మరోవైపు బాలాపూర్ లడ్డూ వేలం తర్వాత ప్రధాన ఊరేగింపు ప్రారంభమై నిమజ్జనం కోసం హుస్సేన్ సాగర్‌ రానుంది. బాలాపూర్ గణేష్ విగ్రహ ఊరేగింపు ప్రారంభమైన తర్వాత, ఇతర విగ్రహాలు ఏకకాలంలో వాటి మండపాల నుండి తమ ఊరేగింపును ప్రారంభిస్తాయని అధికారులు తెలిపారు. చార్మినార్, ఎంజే మార్కెట్ వంటి కీలక ప్రదేశాల వద్ద ప్రధాన ఊరేగింపులో చేరతాయి. ఆ తర్వాత ఊరేగింపు హుస్సేన్ సాగర్‌కు వెళుతుంది. అక్కడ విగ్ర...