భారతదేశం, ఆగస్టు 28 -- బాలీవుడ్ నటి, రచయిత్రి ట్వింకిల్ ఖన్నా గణేష్ చతుర్థి వేడుకల్లో సాంప్రదాయ పట్టు చీరలో మెరిసి అందరి దృష్టిని ఆకర్షించారు. ట్వింకిల్ ఖన్నా స్టైలిష్‌గా, సంప్రదాయబద్ధంగా గణేష్ చతుర్థిని జరుపుకున్నారు. తన 51వ ఏట కూడా ఆమె అందం ఏమాత్రం తగ్గలేదని చెప్పడానికి సాక్ష్యంగా, ఒక అద్భుతమైన రాణి పింక్ చీరలో కనిపించి, పండుగ వేడుకలకు సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఫ్యామిలీతో పంచుకున్నారు. ఈ ఆరు గజాల చీర, ఆమె స్టైల్ గురించి మరింత వివరంగా తెలుసుకుందాం.

తన పోస్ట్‌ను పంచుకుంటూ, ట్వింకిల్ ఖన్నా "మా హృదయాలు గణపతి బప్పా కోసం సిద్ధమయ్యాయి. మా కడుపులు మోదకాల కోసం సిద్ధమయ్యాయి. ఈ పండుగలో మీకు ఏది ఎక్కువగా ఇష్టం?" అంటూ క్యాప్షన్‌లో రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌లో ఆమె తన పెంపుడు శునకంతో కలిసి సోఫాలో కూర్చుని కనిపించారు.

గణేష్ చతుర్థి సందర్భంగా,...