Hyderabad, మే 13 -- ఈ మధ్య సోషల్ మీడియా ప్రపంచం వింతైన, వినోదభరితమైన బ్రెయిన్ టీజర్ చిత్రాలతో నిండిపోతుంది. స్క్రోల్ చేస్తున్నప్పుడు కంటపడే కొన్ని రకాల పజిల్స్ ఒక్కోసారి ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. చూడటానికి సాధారణంగా అనిపించినా వాటి సమాధానాలు మాత్రం అంత తేలికగా కనిపెట్టలేకపోతున్నాం. ఇవి చాలా ఎగ్జైటింగ్‌గా, సరదాగా అనిపించడం మాత్రమే కాదండోయ్. మన మెదడుకు ఒక మంచి వ్యాయామం లాంటివి.

ఇలాంటి పజిల్స్ మన మెదడుకు మేత లాంటివి. మనల్ని ఆలోచించమని సవాలు చేస్తాయి, తద్వారా మన బుద్ధికి పదును పెడతాయి. అయితే ఈ మేధో కసరత్తులో ఒక ప్రత్యేకమైన సరదా కూడా దాగి ఉంటుంది.

ఇప్పుడు మీ ముందుకు అలాంటి ఒక వైరల్ బ్రెయిన్ టీజర్ చిత్రాన్ని తీసుకొచ్చాం. ఇది ఒక సాధారణ గణిత పజిల్ లాగా కనిపిస్తుంది. కొన్ని కూడిక లెక్కలు ఇందులో ఉన్నాయి. కూడికలే కదా అని కూల్ గా తీసుకుంటే సరి...