Hyderabad, జూన్ 24 -- గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఇలా గ్రహాలు రాశి మార్పు చెందినప్పుడు, కొన్ని కొన్ని సార్లు మరో గ్రహంతో సంయోగం చెందుతూ ఉంటాయి. అలాంటప్పుడు శుభయోగాలు, అశుభ యోగాలు ఏర్పడతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జాతకంలో అనేక యోగాలు ఏర్పడతాయి.

యోగాలలో ఉత్తమమైనది, అత్యంత మంగళకరమైనది గజకేసరి యోగం. ఈ యోగం వలన ఆర్థిక పురోభివృద్ధిని పొందవచ్చు. అలాగే, ఈ యోగం వలన ఉద్యోగంలో ప్రమోషన్లు కూడా వస్తాయి. ఆదాయం కూడా పెరుగుతుంది. ఇలా గజకేసరి రాజయోగం అనేక లాభాలను అందిస్తుంది.

గురువు, చంద్రుడు సంయోగం చెందినప్పుడు గజకేసరి యోగం ఏర్పడుతుంది. గురువు, చంద్రుడి కలయిక ద్వారా మనిషి జాతకంలో గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. చంద్రుడు, గురువు వారికి శుభయోగాలను ప్రసాదిస్తారు. గజకేసరి రాజయోగం ఎవరి జాతకంలో అయితే ఏర్పడుతుందో, వారి...