Andhrapradesh, ఆగస్టు 2 -- పర్యాటకంగా గండికోట అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. శుక్రవారం గండికోట వద్ద ఆంధ్రప్రదేశ్ టూరిజం ఇన్వెస్టర్స్ మీట్ కు హాజరైన ఆయన ప్రసంగించారు. గండికోట ప్రాంతాన్ని యాంకర్ హబ్ గా అభివృద్ధి చేస్తున్నట్టు వివరించారు. ప్రకృతి వరప్రసాదంగా ఏర్పడిన గండికోట ప్రాంతం భారత్ గ్రాండ్ కాన్యన్ గా పేరొందిందని అన్నారు.

గండికోట ప్రాంతాన్ని సాస్కీ కింద రూ.78 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసేందుకు ఈ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. అద్భుతమైన పర్యాటక కేంద్రంగా గండికోటను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు చేసిందని ముఖ్యమంత్రి తెలిపారు. అలాగే పర్యాటకులు బస చేసేలా స్టార్ హోటళ్ల నిర్మాణం చేపడతామన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా వివిధ పర్యాటక ప్రాంతాల్లో 50 వేల హోటల్ గదుల నిర్మాణం చేసేల...