Hyderabad, జనవరి 28 -- ప్రతి ఉద్యోగంలో పనిగంటలు పెరిగిపోతున్నాయి. ఇంట్లో చేసినా, ఆఫీసులో చేసినా గంటల కొద్దీ కదలకుండా కూర్చొని పనిచేసే వారి సంఖ్య పెరిగిపోయింది. ఎక్కువసేపు కూర్చొని పని చేయడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తూనే ఉన్నారు. సుదీర్ఘ పని గంటలు అనేవి ఉత్పాదకతను పెంచుతున్నప్పటికీ మనిషి ఆరోగ్యాన్ని మాత్రం దెబ్బతీస్తున్నాయి. వారి వృత్తిగత, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతను నిర్వీర్యం చేస్తున్నాయి. ఆ వ్యక్తి శరీరం మనసు ఆత్మ కూడా బలహీనంగా మార్చేస్తున్నాయి. ఎక్కువ గంటల పాటు కదలకుండా కూర్చుని పనిచేసే వారికి భవిష్యత్తులో వచ్చే పది తీవ్రమైన వ్యాధులు జాబితా ఇక్కడ ఉంది.

ఎక్కువ గంటలు కదలకుండా పనిచేయడం అనేది ఆ వ్యక్తి శారీరక, మానసిక ఆరోగ్యం పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తుంది. శరీరం తీవ్రమైన ఒత్తిడి అలసటకు...