భారతదేశం, జనవరి 26 -- ఉత్తరాఖండ్ లోని పవిత్ర పుణ్యక్షేత్రాల పౌరాణిక వైభవాన్ని, సనాతన ధర్మ సంప్రదాయాలను కాపాడే దిశగా అక్కడి ఆలయ కమిటీలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. దేవభూమిగా పిలుచుకునే ఈ ప్రాంతంలోని ప్రముఖ ఆలయాల్లోకి అన్యమతస్థుల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించాలని అధికారులు భావిస్తున్నారు.

గంగోత్రి ఆలయ కమిటీ ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఒక కీలక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. "గంగోత్రి ధామ్ లోకి అన్యమతస్థుల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధిస్తున్నాం" అని గంగోత్రి ఆలయ కమిటీ అధ్యక్షుడు సురేష్ సెమ్వాల్ స్పష్టం చేశారు. ఈ ఆంక్షలు కేవలం గంగోత్రి ధామ్ కే పరిమితం కాకుండా, శీతాకాలంలో గంగామాత కొలువై ఉండే 'ముఖ్బా' ప్రాంతానికి కూడా వర్తిస్తాయని ఆయన వివరించారు.

శ్రీ బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ (BKTC) కూడా ఇదే దిశగా అడుగులు వేస్తోంది. తమ పరిధిల...