భారతదేశం, జూన్ 11 -- టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి మరోసారి పవర్ ఫుల్ క్యారెక్టర్ చేయబోతున్నారా? చాలా కాలం తర్వాత శక్తిమంతమైన పాత్రలో కనిపించబోతున్నారా? అంటే సినీ వర్గాల నుంచి అవుననే మాటే వినిపిస్తోంది. కార్తి హీరోగా రాబోతున్న ఖైది 2 సినిమాలో అనుష్క నటించబోతున్నారనే క్రేజీ బజ్ తెగ వైరల్ గా మారింది. ఈ వార్త తమిళ ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఇదే నిజమైతే ఆ మూవీపై అంచనాలు మరింత పెరిగిపోవడం ఖాయం.

లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో 2019లో వచ్చిన ఖైదీ మూవీ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఈ సినిమాలో జైల్లో ఉండే ఖైదీ.. రౌడీ గ్యాంగ్ నుంచి పోలీసులను ఎలా తప్పించాడు? పోలీస్ స్టేషన్ ను ఎలా కాపాడాడు? దీని వెనుక ఉన్న కథ ఏంటి? అనేది ఆడియన్స్ ను ఆకట్టుకుంది. మధ్యలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఇప్పుడీ సినిమాకు స...