Hyderabad, ఏప్రిల్ 14 -- ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలైన ఖుష్బు యాభై ఏళ్లు పైబడినా కూడా తన అందంతో అందిరినీ ఆకట్టుకుంటున్నారు. ఇటు సినిమాలు, అటు రాజకీయాలతో బిజీబిజీగా సమయం గడుస్తున్నప్పటికీ ఆమె స్కిన్ కేర్ రోటీన్ ను మాత్రం నిర్లక్ష్య చేయరు. అలాగే చర్మం, కురుల ఆరోగ్యం కోసం ఆమె రసాయలనాలతో కూడిన క్రీములు, ఉత్పత్తుల కన్నా సహజసిద్దమైన ఉత్పత్తులకే ప్రాధాన్యత ఇస్తారు. వీటిని ఆమె స్వయంగా తయారు చేసుకుంటారు.

సోషల్ మీడియాలో ఖుష్బు అందం కోసం ఉపయోగించే ఇంటి నివారణల గురించి తరచుగా షేర్ చేసుకుంటూ ఉంటారు. తాజాగా ఆమె చర్మం ఇంత కాంతివంతంగా యవ్వనంగా ఉండటం వెనకున్న రహస్యాన్ని సోషల్ మీడియాతో పంచుకున్నారు. యూభై ఏళ్లు పైబడినా ముప్పైల్లోనే ఉన్నట్లుగా కనిపించే ఆమె చర్మ రహస్యం ఆమె స్వయంగా తయారు చేసుకున్న ప్రత్యేకమైన నూనె ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆమె వాడే ఈ ఆయిల...