భారతదేశం, జూలై 29 -- ఏపీలో ఖాళీగా ఉన్న మండల పరిషత్, జిల్లా పరిషత్, పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను ఎన్నికల కమిషన్ మెుదలుపెట్టింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న స్థానాలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడింది. దీనికి సంబంధించి వేర్వేరుగా నోటిఫికేషన్ వెలువడింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసింది. ఆగస్టు 10వ తేదీన పోలింగ్ జరగనుంది.

జూలై 28వ తేదీన రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక నోటిఫికేషన్ వెల్లడించింది. ఇందులో 3 ఎంపీటీసీ, 2 జెడ్పీటీసీ, 2 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఖాళీగా ఉన్న స్థానాలు ఏంటో చూద్దాం..

కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం, కారంపూడి, విడవలూరు మండలాల్లో ఎంపీటీసీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. పులివెందుల, ఒంటిమిట్ట ప్రాంతాల్లో జెడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. అంతేకాదు.. కొండపూడి, కడియపులంక గ్రామాల్లో సర్పంచ్ ...