భారతదేశం, మార్చి 5 -- ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ అమెరికాతో ఖనిజాల, భద్రతా ఒప్పందంపై సంతకం చేయడానికి సిద్ధంగా ఉన్నామని, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బలమైన నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. శుక్రవారం శ్వేతసౌధంలో ట్రంప్‌తో తన సమావేశం నిరాశపరిచిందని వోలోడిమిర్ జెలెన్‌స్కీ అంగీకరించారు. అయితే ఆయన మరోసారి ఉక్రెయిన్ పట్ల తన నిబద్ధతను వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ జావెలిన్ క్షిపణులను ఇచ్చినందుకు ట్రంప్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సరైన సమయమని, పరిస్థితులను చక్కదిద్దేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

ఉక్రెయిన్ శాంతి కోస తన నిబద్ధతను మరోసారి పునరుద్ఘాటించాలనుకుంటున్నట్లు వోలోడిమిర్ జెలెన్‌స్కీ ఒక ప్రకటనలో తెలిపారు. 'మనలో ఎవరూ అంతులేని యుద్ధాన్ని కోరుకోరు. శాశ్వతంగా శాంతిని తీసుకురావడానికి ఉక్రెయిన్ త్వరలో చర్చలకు కూర్చోవడానిక...