భారతదేశం, డిసెంబర్ 5 -- బిగ్ బాస్ 9 తెలుగు టికెట్ టు ఫినాలే రేసు హోరాహోరీగా సాగుతోంది. ఫినాలే టికెట్ కోసం కంటెస్టెంట్లు గట్టిగా పోరాడుతున్నారు. ఇంట్లో వాతావరణం వేడిగా మారింది. ఈ క్రమంలో కల్యాణ్, భరణి మధ్య పెద్ద గొడవే జరిగింది. మరోవైపు బిగ్ బాస్ లో ఈ వారం ఓటింగ్ లో పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది.

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో 13వ వారం ఆట సీరియస్ మోడ్ లోకి వెళ్లింది. ఫస్ట్ ఫైనలిస్ట్ కోసం కంటెస్టెంట్లు పోటీ పడతుండటంతో టాస్క్ లు జోరుగా సాగుతున్నాయి. ఇమ్మాన్యుయేల్, కల్యాణ్ టాస్క్ ల్లో అదరగొడుతున్నారు. ఈ వారం భరణి అగ్రెసివ్ మోడ్ లో ఉన్నాడు.

ఈ క్రమంలోనే ఓ టాస్క్ లో సంచాలక్ సంజన నిర్ణయాన్ని తప్పుబడుతూ రెచ్చిపోయాడు భరణి. సంజన, రీతుపై గట్టిగట్టిగా అరిచేశాడు. పాత విషయాన్ని కూడా మధ్యలోకి లాగాడు. దీంతో కల్యాణ్ మధ్యలో జోక్యం చేసుకున్నాడు. నీ పేరు ఎత్తలే...