భారతదేశం, డిసెంబర్ 10 -- బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ ఎండింగ్ కు చేరువవుతోంది. వచ్చే వారమే ఫినాలే వీక్. ఈ నేపథ్యంలో టికెట్ టు ఫినాలే పట్టేయాలని, టాప్-5లో ఉండాలని కంటెస్టెంట్లు తెగ టాస్క్ లు ఆడేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒకరిపై మరొకరు అరిచేసుకుంటున్నారు. తాజాగా కల్యాణ్ పై భరణి మరోసారి ఫైర్ అయ్యాడు. కల్యాణ్ ను తనూజ కమాండ్ చేస్తుందని అన్నాడు.

బిగ్ బాస్ 9 తెలుగులో కల్యాణ్ వర్సెస్ భరణి మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా హౌస్ లో బాల్ టాస్క్ పెట్టారు. ఇందులో భరణికి సంజన ఎక్కువ బాల్స్ వేసిందని కల్యాణ్ అంటాడు. దీంతో భరణి మళ్లీ కల్యాణ్ పైకి వస్తాడు. చివర్లో కల్యాణ్ ను తనూజ బాగా కమాండ్ చేస్తుందని చెప్తాడు.

పడాల కల్యాణ్ ఇప్పటికే బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ ఫైనల్ చేరిపోయాడు. ఇక టాప్-5లో నాలుగు స్థానాలు మిగిలాయి. ఇందులో తనూజ పుట్టస్వామి, ఇమ్మాన్యుయేల్, భరణిక...