భారతదేశం, జూన్ 27 -- విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా కన్నప్ప' జూన్ 27న (శుక్ర‌వారం) ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ మైథ‌లాజిక‌ల్ యాక్ష‌న్ మూవీలో ప్ర‌భాస్‌, మోహ‌న్‌లాల్‌, అక్ష‌య్‌కుమార్ గెస్ట్ రోల్స్ చేశారు. ప్రీతి ముకుంద‌న్ హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీలో మోహ‌న్‌బాబు ఓ కీల‌క పాత్ర పోషించారు. మోహన్ బాబు నిర్మించిన ఈ సినిమాకు మ‌హాభార‌తం ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. క‌న్న‌ప్ప ఎలా ఉంది? ప్ర‌భాస్ గెస్ట్ రోల్ ఆడియెన్స్‌ను మెప్పించిందా? లేదా? అంటే?

తిన్నడు (విష్ణు మంచు) నాస్తికుడు. చిన్నతనం నుంచే భక్తి, దేవుడు, మూఢ నమ్మకాల‌ను పట్టించుకోడు. కానీ తండ్రి నాథనాథుడు (శరత్ కుమార్) మాటను మాత్రం పాటిస్తాడు తిన్నడు. అలాంటి తిన్నడు నెమలి (ప్రీతి ముకుందన్) ప్రేమలో పడిపోతాడు. నెమలితో పెళ్లి త‌ర్వాత తిన్నడిలో ఎలాంటి మార్పులు వ‌చ్చాయి? ఈ కథలో వా...