Hyderabad, ఆగస్టు 17 -- రజనీకాంత్, నాగార్జున, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, అమీర్ ఖాన్ ఇలా ఐదు ఇండస్ట్రీల స్టార్ యాక్టర్స్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ కూలీ. విక్రమ్, లియో సినిమాల డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన కూలీ సినిమా ఆగస్ట్ 14న విడుదలైంది. తొలి రోజున అదిరిపోయే ఓపెనింగ్ కలెక్షన్స్ అందుకుంది కూలీ.

అయితే, రెండో రోజు కాస్తా తగ్గిన కూలీ కలెక్షన్స్ మూడో రోజు కూడా క్షీణించాయి. కానీ, ఓవర్సీస్‌లో మాత్రం మంచి కలెక్షన్స్ రాబట్టింది కూలీ చిత్రం. బాలీవుడ్ లెక్కల ప్రకారం కూలీ సినిమాకు ఇండియాలో మూడో రోజు అయిన శనివారం (ఆగస్ట్ 16) రూ. 38.50 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి.

అంటే, ఇవి రెండో రోజు వచ్చిన రూ. 54.75 నెట్ కలెక్షన్స్ కంటే చాలా తక్కువ. అయితే, మూడు రోజుల్లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కూలీ సినిమాకు రూ. 158.25 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. అలాగే...