Hyderabad, జూన్ 17 -- నటుడు కమల్ హాసన్ నటించి, నిర్మించిన 'థగ్ లైఫ్' సినిమాను కర్ణాటకలోని థియేటర్లలో ప్రదర్శించకపోవడంపై సుప్రీంకోర్టు.. కర్ణాటక ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడింది. జస్టిస్ ఉజ్జల్ భుయాన్, మన్మోహన్ లతో కూడిన ధర్మాసనం కమల్ హాసన్ క్షమాపణ చెప్పాలని సూచించినందుకు కర్ణాటక హైకోర్టును కూడా తప్పుబట్టింది.

థగ్ లైఫ్ సినిమాను కర్ణాటక బ్యాన్ చేయడంపై కమల్ హాసన్ సుప్రీంకోర్టు వెళ్లాడు. దీనిపై మంగళవారం (జూన్ 17) విచారణ జరిగింది. క్షమాపణ చెప్పాలని అడగడం హైకోర్టు పని కాదని కూడా ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించిన పీటీఐ రిపోర్టు వెల్లడించింది. "అతని నుంచి క్షమాపణ కోరడం హైకోర్టు పని కాదు" అని జస్టిస్ మన్మోహన్ ఈ సందర్భంగా అన్నారు.

కన్నడ భాషపై కమల్ చేసిన వ్యాఖ్యలు కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (KFCC) సహా అక్కడి కన్నడ సంఘాలను ఆగ్రహానికి గురి చేస...