భారతదేశం, అక్టోబర్ 29 -- మహారాణి.. ఇండియన్ ఓటీటీ స్పేస్ లోని సూపర్ హిట్ పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లలో ఒకటి. సోనీ లివ్ ఓటీటీ స్ట్రీమింగ్ చేస్తున్న ఈ సిరీస్ నాలుగో సీజన్ వచ్చే వారమే స్ట్రీమింగ్ కానుంది. తాజాగా బుధవారం (అక్టోబర్ 29) రిలీజైన ట్రైలర్ ఎంతో ఉత్కంఠ రేపేలా సాగింది.

ప్రముఖ బాలీవుడ్ నటి హుమా ఖురేషీ నటించిన వెబ్ సిరీస్ మహారాణి. ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. బీహార్ రాజకీయాల చుట్టూ తిరుగుతూ ప్రతి సీజన్ కు ఉత్కంఠ రేపుతూ వెళ్తున్న ఈ వెబ్ సిరీస్.. ఇప్పుడు నాలుగో సీజన్ తో వస్తోంది. ఈసారి ఫైట్ బీహార్ వర్సెస్ ఢిల్లీ అనేలా సాగింది.

మహారాణి బీహార్ వదిలి ఏకంగా ఢిల్లీ ప్రధానమంత్రి పీఠంపై కన్నేయడం ఇందులో చూడొచ్చు. తాజాగా రిలీజైన ట్రైలర్లో రాణీ భారతి సీఎం పీఠాన్ని తన కూతురికి అప్పగించి ఢిల్లీ రాజకీయాలపై దృష్టి పెట్టడం చూడొచ్చు. అ...