భారతదేశం, డిసెంబర్ 15 -- తిరుమలలో పట్టు శాలువాలకు బదులుగా పాలిస్టర్‌ను ఉపయోగించినట్టుగా ఇటీవల బయటపడిన విషయం తెలిసిందే. అయితే బయట నుంచి సేకరణలో అక్రమాలను గుర్తించేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకోనున్నుట్టుగా తెలుస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త సేకరణ మాన్యువల్‌ను ప్రవేశపెట్టనుంది. అంతేకాదు బయటి ఏజెన్సీల నుండి కొనుగోలు చేసిన అన్ని సామగ్రికి థర్డ్ పార్టీ ధృవీకరణను తప్పనిసరి చేస్తుంది. ఇటీవల చైర్మన్ బీఆర్ నాయుడు నేతృత్వంలో జరిగిన టీటీడీ ట్రస్ట్ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

కల్తీ నెయ్యి, నకిలీ పట్టు దుపట్టాలకు సంబంధించిన కేసుల నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న సేకరణ, నాణ్యత తనిఖీ వ్యవస్థలను బలోపేతం చేయాలని టీటీడీ భావిస్తోంది. నెయ్యి కల్తీ కేసుపై ప్రస్తుత దర్యాప్తులో సరఫరా గొలుసులో తీవ్రమైన లోపాలు వెల్లడయ్యాయని, నాణ్యత...