భారతదేశం, జూన్ 10 -- అమరావతి: సిలికాన్ వ్యాలీ మాదిరిగానే అమరావతి ప్రపంచ క్వాంటమ్ వ్యాలీగా ప్రత్యేక గుర్తింపు పొందాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. క్వాంటమ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉండాలని, అందుకు ఏపీ స్టేట్ క్వాంటమ్ మిషన్ మార్గదర్శిగా నిలవాలని ఆయన అన్నారు. సోమవారం సచివాలయంలో ఐటీ రంగ నిపుణులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం చంద్రబాబు ఈ దిశగా కీలక ఆదేశాలు జారీ చేశారు.

అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఎకోసిస్టమ్‌ను ఏర్పాటు చేయడంపై ఐటీ నిపుణులతో సీఎం చంద్రబాబు విస్తృతంగా చర్చించారు. ఈ నెల 30న విజయవాడలో క్వాంటమ్ మిషన్‌పై ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ వర్క్‌షాప్‌కు ఐటీ, ఫార్మా, ఆగ్రో, హెల్త్ రంగాల ప్రతినిధులు, విశ్వవిద్యాలయాలు, కళాశాలల నిపుణులు, స్టార్టప్‌లు,...