భారతదేశం, జూన్ 30 -- విజయవాడలో జరిగిన 'క్వాంటం వ్యాలీ నేషనల్ వర్క్‌షాప్‌'కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా అమరావతిని క్వాంటం టెక్నాలజీకి కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ వంటి దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో అమరావతిలో క్వాంటం వ్యాలీ పార్క్‌ను ఏర్పాటు చేయబోతున్నారు. ఇది దేశ భవిష్యత్తుకు, టెక్నాలజీ రంగానికి ఎంతో కీలకమైన అడుగని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

క్వాంటం వ్యాలీ వర్క్‌షాప్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు స్టార్టప్ కంపెనీల ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐబీఎం సంస్థ ప్రదర్శించిన ప్రోటోటైప్ క్వాంటం కంప్యూటర్‌ను ముఖ్యమంత్రితో పాటు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఆసక్తిగా పరిశీలించారు. దేశవ్యాప్తంగా క్వాంటం టెక్నాలజీపై ఇంత పెద్ద స్థాయిలో చర్చ జరగడం ఇదే మ...