భారతదేశం, నవంబర్ 19 -- క్లౌడ్‌ఫ్లేర్ సేవల్లో ఏర్పడిన సాంకేతిక సమస్య (ఔటేజ్) కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌లు ప్రభావితమయ్యాయి. చాట్‌జీపీటీ, న్యూజెర్సీ ట్రాన్సిట్ వంటి సంస్థల సేవలు నిలిచిపోయాయి. ఈ సమస్యను పరిష్కరించినప్పటికీ, ఇంకా ఏవైనా ఇబ్బందులు ఉన్నాయేమోనని క్లౌడ్‌ఫ్లేర్ నిశితంగా పరిశీలిస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ మౌలిక సదుపాయాలను అందించే కీలక సంస్థ క్లౌడ్‌ఫ్లేర్. ఈ కంపెనీ సేవల్లో మంగళవారం తెల్లవారుజామున ఒక సాంకేతిక సమస్య తలెత్తింది. దీని కారణంగా చాట్‌జీపీటీ, ఆన్‌లైన్ గేమ్‌ లీగ్ ఆఫ్ లెజెండ్స్ నుంచి న్యూజెర్సీ ట్రాన్సిట్ సిస్టమ్ వరకు అనేక సర్వీసుల వినియోగదారులు ఇబ్బంది పడ్డారు.

తమ ఇంజనీర్లు వినియోగదారులను ఇబ్బంది పెట్టిన సమస్యల్లో కొన్నింటిని పరిష్కరించామని, ఇకపై అలాంటి అంతరాయాలు కనిపించడం లేదని క్లౌడ్‌ఫ్లేర్ ...