Hyderabad, జూన్ 25 -- ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన పంచాయత్ సీజన్ 4 వచ్చేసింది. కానీ, ఈసారి ప్రేక్షకులు నిరాశకు గురయ్యారు. గత మూడు సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ ఆకట్టుకోలేకపోయింది. అంతేకాదు చివరి ఎపిసోడ్ మాత్రం చాలా మందికి నచ్చలేదని ఐఎండీబీ రేటింగ్ చూస్తే స్పష్టమవుతోంది. గత మూడు సీజన్లలో చివరి ఎపిసోడ్ కు అతి తక్కువగా 8.8 రేటింగ్ రాగా.. ఈసారి అంతకంటే కూడా దారుణమైన రేటింగ్ నమోదైంది.

పంచాయత్ కొత్త సీజన్ ఎప్పుడు వచ్చినా.. ఏదో ఒక కొత్తదనాన్ని అందిస్తూ వస్తుంది. ప్రారంభం నుంచి ఎన్నో మరపురాని జ్ఞాపకాలు, ఆనందాన్ని అభిమానులకు అందించింది. కానీ సీజన్ 4 మాత్రం గతంలో మాదిరిగా లేదు. సీజన్ 3 నుంచే ఈ మార్పుకు సంకేతాలు కనిపించాయి. ఇప్పుడు సీజన్ 4 ఆ సందేహాలను నిజం చేసింది. పంచాయత్ సిరీస్ ఐదో సీజన్‌తో ముగుస్తుందని తెలుస్తున్నప్పటికీ, సీజన్ 4 ముగింపు మాత్రం చాలా మంద...