భారతదేశం, డిసెంబర్ 8 -- సిద్దూ జొన్నలగడ్డ, రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి నటించిన మూవీ తెలుసు కదా. ఈ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజైనా సక్సెస్ కాలేకపోయింది. సిద్దూకి వరుసగా రెండో ఫ్లాప్ ఇచ్చింది. అయితే దీనిపై తాజాగా గుల్టెలో జరిగిన డైరెక్టర్స్ రౌండ్ టేబుల్లో తెలుసు కదా డైరెక్టర్ నీరజ కోన స్పందించింది. మూవీ చాలా అడ్వాన్స్‌గా ఉండటం వల్ల ప్రేక్షకులకు నచ్చలేదేమో అని అభిప్రాయపడింది.

తెలుసు కదా మూవీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలోని హీరో పాత్ర స్వభావం, ప్రేక్షకుల అంచనాల గురించి నీరజ కోన ఇలా వివరించింది. "హీరో పాత్రలో గ్రే షేడ్స్ (ప్రతికూల ఛాయలు) ఉంటాయి. కనీసం క్లైమాక్స్‌లో అయినా హీరో మారిపోయి ఉంటే సినిమా కచ్చితంగా క్లిక్ అయ్యేది. ఎందుకంటే మన ప్రేక్షకులు కోరుకునేది, ఆశించేది అదే. కానీ హీరో చివరి వరకూ అలాగే మారకుండా ఉండిప...