భారతదేశం, జూలై 31 -- ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ చివరి పోరుకు వచ్చేసింది. గురువారం (జులై 31) ఓవల్ లో అయిదో టెస్టు ప్రారంభం కానుంది. మరికొన్ని గంటల్లోనే ఈ పోరుకు తెరలేస్తుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం సిరీస్ లో ఇంగ్లాండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ లో టీమిండియా ఓడినా, డ్రా చేసుకున్నా సిరీస్ పోతుంది. సిరీస్ ను సమం చేయాలంటే భారత్ ఈ టెస్టులో గెలవాల్సిందే.

శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలోని భారత్ ఈ మ్యాచ్ కోసం బెటర్ గానే రెడీ అయింది. మాంచెస్టర్‌లో గత టెస్టులో గొప్ప ఫైటింగ్ స్పిరిట్ తో టీమ్ కాన్ఫిడెన్స్ పెరిగింది. అయితే ఈ మ్యాచ్ కు వరుణుడు అడ్డు పడే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆక్యూ వెదర్ ప్రకారం గురువారం నాడు ఉదయం మేఘావృతమైన ఆకాశంతో ప్రారంభమై మధ్యాహ్నం వర్షం కురిసే అవకాశం ఉంది. సాయంత్రం 3-5 గంటల మధ్య ఉరుములతో కూడిన జల...