భారతదేశం, ఏప్రిల్ 19 -- అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ హిట్ తో హీరో నందమూరి కల్యాణ్ రామ్ ఆనందంలో తేలిపోతున్నారు. ఈ మూవీకి మిక్స్ డ్ టాక్ వచ్చినా.. ఎమోషనల్ డ్రామా అదిరిపోయిందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ మాత్రం అసలు ఊహించలేదని పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి క్లైమాక్స్ ను చూడలేదని అంటున్నారు. దీంతో ఈ మూవీ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఈ ప్రెస్ మీట్ లో కల్యాణ్ రామ్ కూడా ఈ క్లైమాక్స్ పై చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' మూవీ క్లైమాక్స్ పై ఓ రేంజ్ లో పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. ఈ మూవీకి క్లైమాక్స్ బలం అనే కామెంట్లు వస్తున్నాయి. క్లైమాక్స్ లో ట్విస్ట్ సినిమాను నిలబెట్టిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ క్లైమాక్స్ పై తన కొడుకు చెప్పిన మాటలను కల్యాణ్ రామ్ బయటపెట్టారు.

''ఈ రోజు నా కొడుకు మార్నిం...