భారతదేశం, జనవరి 29 -- మహారాష్ట్ర పూణెలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగుచూసింది. దౌండ్ తహసీల్‌లోని ఓ స్కూల్‌లో విద్యార్థి తన సహవిద్యార్థిని అత్యాచారం చేసి చంపేందుకు తోటి విద్యార్థినికి 100 రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. పాఠశాల విషయాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించడంతో వివాదం మరింత ముదిరింది.

పూణెలోని ఓ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి తల్లిదండ్రుల సంతకాన్ని ఫోర్జరీ చేశాడు. ఈ విషయాన్ని ఓ విద్యార్థిని చూసింది. వెళ్లి టీచర్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో కోపం పెంచుకున్న విద్యార్థి.. మరో విద్యార్థి వద్దకు వెళ్లాడు. రూ.100 సుపారీ ఇస్తానని, తనపై ఫిర్యాదు చేసిన బాలికను అత్యాచారం చేసిన తర్వాత చిత్రహింసలు చేసి చంపాలని కాంట్రాక్ట్ ఇచ్చాడు.

బాలికకు విషయం తెలియడంతో వెళ్లి ఇంట్లో చెప్పింది. కుటుంబ సభ్యులు పాఠశాలలో...