Hyderabad, ఏప్రిల్ 20 -- ఈస్టర్ పండుగ ఏసుక్రీస్తు మరణం పై సాధించిన విజయానికి గుర్తుగా నిర్వహించుకుంటారు. ఇది క్రైస్తవ సోదరులకు ఎంతో ముఖ్యమైనది. ఇది యేసు పునరుత్థానాన్ని సూచిస్తుంది. అలాగే లెంట్ సీజన్ ముగింపును కూడా చెబుతుంది. శుక్రవారం రోజు శిలువ పై ప్రాణాలు వదిలిన ఏసు ఈస్టర్ పండుగ రోజే తిరిగి ప్రాణం పోసుకుని ప్రజల మధ్యకు వస్తారు. అందుకే ఈ పండుగ ఎంతో ఆనందంగా నిర్వహించుకుంటారు క్రైస్తవులు.

ఈస్టర్ అనేది కొత్త విశ్వాసానికి, ఆశకు, కొత్త జీవితానికి చిహ్నంగా భావిస్తారు. మరణమే జీవితానికి అంతం కాదని యేసుక్రీస్తు జీవితం చెబుతుంది. ఈస్టర్ పండుగతో క్రైస్తవ సోదరులు పాటించిన లెంట్ సీజన్ ముగింపు కూడా జరుగుతుంది. ఈస్టర్ రోజున క్రైస్తవులు చర్చలలో ప్రార్థనలు చేస్తారు. కుటుంబం స్నేహితులతో వేడుకలు నిర్వహించుకుంటారు. ఇది ప్రేమ, దయను చాటి చెప్పే పండుగ.

1. ప...