భారతదేశం, ఏప్రిల్ 21 -- కేథలిక్‌ల అత్యున్నత మత గురువు పోప్‌ ఫ్రాన్సిస్‌ (88) కన్నుమూశారు. ఇటలీ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 7.35 గంటలకు స్వర్గస్తులయ్యారు. పోప్ ఫ్రాన్సిన్స్ గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్యలు, డబుల్‌ న్యూమోనియా, కిడ్నీ సమస్యలతో బాధపడ్డారు. 38 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన గత నెలలో డిశ్చార్జ్ అయ్యారు. ఆయన మరణాన్ని వాటికన్‌ వర్గాలు ధ్రువీకరించాయి. 2013లో పోప్‌ బెనిడెక్ట్‌ తర్వాత ఫ్రాన్సిస్‌ పోప్ బాధ్యతలు చేపట్టారు. పోప్ ఫ్రాన్సిస్‌ 1938లో దక్షిణ అమెరికాలోని అర్జెంటీనాలో జన్మించారు. దక్షిణ అమెరికా నుంచి పోప్ పదవిని అందుకొన్న తొలి వ్యక్తి ఆయనే.

పోప్ ఫ్రాన్సిస్ మరణంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు పలువురు నేతలు సంతాపం తెలిపారు.

"తన వినయం, కరుణ, శాంతి సందేశం ద్వారా లక్షలాది మందిలో స్ఫూర్తినిచ్చిన ఆధ్యాత్మిక నాయకు...