Hyderabad, ఏప్రిల్ 29 -- క్రైమ్ థ్రిల్లర్ జానర్ కంటెంట్ ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్ లో వచ్చిన అది సూపర్ హిట్టే అవుతుంది. అలా జియోహాట్‌స్టార్ ఓటీటీలో 2019లో తొలిసారి వచ్చిన వెబ్ సిరీస్ క్రిమినల్ జస్టిస్. ఈ క్రైమ్ థ్రిల్లర్ లీగల్ డ్రామా వెబ్ సిరీస్ ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకోగా.. నాలుగో సీజన్ రెడీగా ఉంది.

సరిగ్గా ఆరేళ్ల కిందట అంటే ఏప్రిల్ 5, 2019లో క్రిమినల్ జస్టిస్ తొలి సీజన్ స్ట్రీమింగ్ కు వచ్చింది. అది కాస్తా సూపర్ హిట్ అవడంతో తర్వాత మరో రెండు సీజన్లను కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు నాలుగో సీజన్ ఎ ఫ్యామిలీ మ్యాటర్ పేరుతో వస్తోంది. ఈ కొత్త సీజన్ మే 22 నుంచి జియోహాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

మంగళవారం (ఏప్రిల్ 29) ఈ సీజన్ టీజర్ రిలీజ్ చేశారు. లాయర్ మాధవ్ మిశ్రా (పంకజ్ త్రిపాఠీ) సరికొత్త కేసుతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడ...