Nagarjuna sagar,telangana, ఏప్రిల్ 26 -- సుంకిశాల ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇంటేక్ వెల్ నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేసేలా ముందుకు సాగుతున్నారు. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పనుల ప్రగతిని పర్యవేక్షిస్తున్నారు. సకాలంలో పనులను పూర్తి చేయటం ద్వారా. హైదరాబాద్ కు తాగు నీటి ఇబ్బందులు రాకుండా చూడాలని భావిస్తున్నారు.

నాగార్జున సాగర్ వద్ద నిర్మిస్తున్న సుంకిశాల ప్రాజెక్టు నిర్మాణ పనుల్ని ఇటీవలే జలమండలి ఎండీ అశోక్ రెడ్డి సందర్శించారు. జలమండలి ఉన్నతాధికారులతో కలిసి ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఇంటేక్ వెల్ నిర్మాణ పనులపై ఆరా తీశారు. ప్రాజెక్టు పైపు లైన్ పనుల్ని పరిశీలించారు. పైపు విస్తరణ పనులలో ప్రత్యేక దృష్టి సారించాలని ఏజెన్సీ అధికారులకు సూచించారు. నాణ్యత లో నిర్లక్ష్యం వహించకూడదన్నారు.

ప్రస్తుతం సివిల్, టన్నెల్, ఎలక్ట్రికల్,...