భారతదేశం, జనవరి 23 -- గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీ 'పెద్ది' షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో ఆడిపాడేందుకు ప్రముఖ నటి మృణాల్ ఠాకూర్‌తో చర్చలు జరుగుతున్నాయన్న క్రేజ్ బజ్ ఇప్పుడు ఇండస్ట్రీలో నెలకొంది. ధనుష్ తో పెళ్లి పుకార్ల నేపథ్యంలో మృణాల్ ఇలా ఐటెమ్ సాంగ్ అంటూ వార్తల్లో నిలవడం విశేషం.

ఈమధ్యే మృణాల్ ఠాకూర్.. స్టార్ హీరో ధనుష్‌తో ప్రేమలో ఉందంటూ వచ్చిన పుకార్ల కారణంగా వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. వీరిద్దరూ ఫిబ్రవరి 14న పెళ్లి చేసుకోబోతున్నారని కూడా కొన్ని రిపోర్టులు వెల్లడించాయి. అయితే మృణాల్ టీమ్ ఈ పుకార్లను ఖండించింది. ఆమె ప్రస్తుతం తాను ఒప్పుకున్న సినిమాలపైనే పూర్తి దృష్టి సారించిందని వారు స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించిన మృణాల్ ఠాకూర్.. రామ్ చర...