భారతదేశం, నవంబర్ 28 -- తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం హీరోగా మారుతున్నాడు. అరుణ్ మతీశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'డీసీ' అనే సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈలోపే అతడు నెక్ట్స్ డైరెక్ట్ చేయబోయే సినిమాపై క్రేజీ బజ్ నెలకొంది. తెలుగులో అతడు అల్లు అర్జున్ తో తన తొలి సినిమా చేస్తున్నాడని తమిళ మీడియా చెబుతుండటం విశేషం.

నిజానికి తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కూలీ మూవీ తర్వాత తెలుగులో పవన్ కల్యాణ్ తో మూవీ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. తాజాగా పవర్ స్టార్ కాదు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేయబోతున్నాడని, ఇప్పటికే కథ కూడా అతనికి చెప్పాడని పలు రిపోర్టులు చెబుతున్నాయి. లోకేష్ హీరోగా నటించిన తర్వాత 'ఖైదీ 2' మూవీని డైరెక్ట్ చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు లోకేష్ కనగరాజ్ ఒక కథను అల్లు అర్జున్‌కు చెప్పినట్లు సమాచార...