భారతదేశం, ఆగస్టు 15 -- ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబీ 29 (SSMB 29) చిత్రం కోసం యావత్ భారతదేశం ఎదురుచూస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన విషయాలను గోప్యంగా ఉంచడానికి దర్శకుడు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కలిసి ఉన్న ఒక్క ఫోటోను కూడా విడుదల చేయలేదు. అయితే ఆగస్టు 9న మహేష్ పుట్టినరోజు వేడుకల్లో ప్రియాంక పాల్గొన్న ఒక ఫోటో ఆన్‌లైన్‌లో లీక్ అయింది.

మహేష్ బాబు, ప్రియాంక చోప్రా కలిసి ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది అభిమానులకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా జోడీగా ఉన్న అరుదైన ఫోటో మహేష్ పుట్టినరోజు పార్టీలో తీసిందంటూ అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ ఫోటోలో మహేష్ నీలం రంగు టీ-షర్టు, గ్రే కలర్ క్యాప్ ధరించి నవ్వుతూ ప్రియాంక చోప్రా...