భారతదేశం, జనవరి 5 -- అందాల భామ అనుపమ పరమేశ్వరణ్ మరో కొత్త మూవీతో తెలుగు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయడానికి వచ్చేస్తోంది. గతేడాది ఏడు సినిమాలతో రికార్డు క్రియేట్ చేసిన అనుపమ కొత్త ఏడాదిలోనూ దూకుడు కొనసాగిస్తోంది. ఆమె లేటెస్ట్ సినిమాకు క్రేజీ టైటిల్, క్రేజీ కాంబినేషన్ కుదిరింది. ఆ సినిమా పేరు 'క్రేజీ కళ్యాణం' అని మేకర్స్ ఇవాళ అనౌన్స్ చేశారు.

ఈ రోజుల్లో టైటిల్ ఎంత డిఫరెంట్ గా ఉంటే అంత వైరల్ గా మారుతుంది. జనాల్లోకి డైరెక్ట్ గా వెళ్లిపోతే మూవీకి మంచి రీచ్ ఉంటుంది. ఇప్పుడు క్రేజీ కళ్యాణం టీమ్ కూడా అదే ఫాలో అయింది. తమ మూవీకి క్రేజీగా క్రేజీ కళ్యాణం అని పేరు పెట్టింది. ఆరో సినిమాస్ బ్యానర్ నుంచి వస్తున్న రెండో ప్రొడక్షన్ ఇది. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయింది.

''ఆరో సినిమాస్ ప్రొడక్షన్ నంబర్ 2 క్రేజీ కళ్యాణం. ఇదే క్రేజీయెస్ట్ కాంబినేషన్. అద...